బిజినెస్

21/06/2014

న్యూఢిల్లీ, జూన్ 20: దేశంలో విద్యుత్ కొరత నానాటికీ తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వరంగ బొగ్గు ఉత్పాదక సంస్థ కోల్ ఇండియాకు ఉత్పత్తి పెంచాలని మోదీ సర్కారు సూచించింది.

21/06/2014

ముంబయి, జూన్ 20: ప్రభుత్వరంగ బ్యాంకుల మూలధన అవసరాల కోసం రాబోయే బడ్జెట్‌లో అధికంగా నిధుల కేటాయింపులు ఉంటాయన్న వార్తలను ఆర్థిక సేవల కార్యదర్శి జిఎస్ సంధూ తోసిపుచ్చారు. ‘ఈ బడ్జెట్‌లో లేవు. ఒకవేళ అత్యవసరంగా ఏదైనా ఆర్థిక సాయం కావాల్సి వస్తే ప్రభుత్వం ఉండనే ఉంది.’ అని శుక్రవారం ఇక్కడ స్పష్టం చేశారు.

21/06/2014

న్యూఢిల్లీ, జూన్ 20: వచ్చే నెలలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2014-15కుగానూ పార్లమెంట్‌లో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న క్రమంలో వృద్ధిరేటు ప్రగతికి ప్రపంచ బ్యాంకు శుక్రవారం పలు సూచనలు చేసింది.

21/06/2014

న్యూఢిల్లీ, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ రాష్ట్రంలో మోటార్‌సైకిళ్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ సంస్థను కోరారు.

21/06/2014

లండన్, జూన్ 20: భారత్‌లో మిలియనీర్ల సంఖ్య ఒక లక్షా 56వేల మందికి పెరిగింది. 2013లో కొత్తగా మూడు వేల మంది మిలియనీర్ల స్థాయికి ఎదిగారు.

21/06/2014

ముంబయి, జూన్ 20: ఇరాక్ అంతర్యుద్ధం ఆందోళనలు, వర్షాభావం భయాల మధ్య దేశీయ స్టాక్‌మార్కెట్లు గత రెండు రోజుల నష్టాలను కొనసాగిస్తూ శుక్రవారం 2 వారాల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. హెల్త్‌కేర్, ఆటో, క్యాపిటల్ గూడ్స్, పవర్, మెటల్ రంగాల షేర్లు 0.95 శాతం నుంచి 0.65 శాతం క్షీణించాయి.

21/06/2014

కోల్‌కతా, జూన్ 20: ఉద్దేశపూర్వక ఎగవేతదారు (విల్‌ఫుల్ డిఫాల్టర్)గా ప్రకటించే ముందు బ్యాంక్ ఇంటర్నల్ కమిటీ ఎదుట హాజరై అలా ఎందుకు ప్రకటించకూడదో తెలియజేయాలని లిక్కర్ కింగ్, రుణ పీడిత విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యాను యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యుబిఐ) కోరనుంది.

20/06/2014

కాకినాడ, జూన్ 19: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కొత్త ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకుంటుందా అని కాకినాడ యాంకరేజి పోర్టు (లంగరు రేవు) కార్మికులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఆధీనంలోగల ఈ పోర్టు ప్రస్తుతం పలు సమస్యలను ఎదుర్కొంటోంది.

20/06/2014

ముంబయి, జూన్ 19: ఇరాక్‌లో పెరిగిపోతున్న అశాంతి చమురు సరఫరాలను దెబ్బ తీయవచ్చన్న భయాల నేపథ్యంలో చమురు, గ్యాస్ రంగాలకు చెందిన షేర్లు భారీ నష్టాలకు గురి కావడంతో సెన్సెక్స్ గురువారం వరసగా రెండోరోజు కూడా నష్టాలతో ముగిసింది.

20/06/2014

కొత్తగా ఐదు శాఖలు డిహెచ్‌ఎఫ్‌ఎల్ వెల్లడి

Pages

X
Enter your Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telegu | Telugu News Headlines | Andhra Bhoomi username.
Enter the password that accompanies your username.
CAPTCHA
This question is for testing whether you are a human visitor and to prevent automated spam submissions.
Loading